GROUP INSURANCE SCHEMEఆరంభం :- గతంలో నున్న కుటుంబ సంక్షేమ పధకం (ఎఫ్.బి.ఎఫ్) స్థానంలో జి.ఓ. నెం.293 తేది 8/10/1984 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ గ్రూపు ఇన్సూరెన్స్ స్కీం 1984 అను క్రొత్త స్కీము ది. 1/11/1984 నుండి ప్రవేశపెట్టబడినది. పాత ఎఫ్.బి.ఎఫ్ పధకంలో అప్పటి వరకు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి రిటైరైనప్పుడు లేక చనిపోయినప్పుడు చెల్లిస్తారు. జి.ఓ.నెం.367, ఆర్ధిక తేది 15/11/1994 ప్రకారం యూనిట్ రూ.10/- ల నుండి రూ.15/- లకు పెంచడమైనది. ఉద్యోగి చెల్లించే ప్రతి యూనిట్ రూ.15/- లకు గాను, రూ.4.50లు ఇన్సూరెన్స్ కవరేజి క్రింద ఖాతాకు, మిగిలిన రూ.10.50లు సేవింగ్ ఖాతాకు జమ చేయబడును. ఉద్యోగులను వారి యొక్క స్కేల్ ఆఫ్ పే ప్రకారము నాలుగు గ్రూపులు ఎ, బి, సి, డి లుగా విభజన చేయడం జరిగింది. RPS – 2010, G.O.Ms.No.225, Dated 22-6-2010 ప్రకారము:

 OF PAY

GROUP

NUMBER OF UNITS

AMOUNT

REMARKS

18030 - 55660

A

8

Rs.120

Gr-1 HM/meo, 8yrs spl grade/SGT 24 yrs and above

11860 - 42590

B

4

Rs.60

Meo/ SA ordinary/SA 8yrs spl grade/SGT 16 yrs

8440 - 33200

C

2

Rs.30

SGT ordinary/ SGT 8 yrs spl grade

6700 - 23650

D

1

Rs.15

 

ఉద్యోగికి జి.ఐ.ఎస్ గ్రూపు వర్తించే విధానము – ఉద్యోగి తను పొందుచున్న మూలవేతనం ఆధారంగా కాకుండా, అతను పొందుచున్న స్కేల్ ఆఫ్ పే ప్రకారం ఏ గ్రూపుకు చెందునో చూచుకొని ప్రీమియం చెల్లించాలి.                                                                                                   సభ్యత్వ గ్రూపు మార్పు ---- ఉద్యోగి సంవత్సరము మధ్యలో రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వలన అతని వేతన స్కేలు గరిష్ట పరిమితి మారినను తదుపరి నవంబరు నుండి మాత్రమే అతని సభ్యత్వ గ్రూపు మారుతుంది. కాని ఎయిడెడ్ వారికి జూలై నుండి మారును. ప్రమోషన్ వెనుకటి తేది నుంచి అమలులోనికి వచ్చినప్పటికి సభ్యత్వ గ్రూపు వెనుకటి తేది నుండి మారదు. ఈ మార్పును ఎప్పటికప్పుడు సేవా పుస్తకంనందు నమోదు చేయించుకొనవలెను.                                                                                                 నిబంధనలు --- ది.1/11/1984 తర్వాత సర్వీసు నందు చేరినవారు తదుపరి నవంబరు నుండి మాత్రమే సభ్యులగుదురు. అట్టి వారికి ఇన్సూరేన్సు కవర్ చేయుటకు వారు ఏ గ్రూపుకు చెందుతారో దానిని బట్టి యూనిట్ రూ.4.50/- చొప్పున తదుపరి నవంబరు వచ్చు వరకు చెల్లించాలి. ఉద్యోగి ఫారం – 7లో యిచ్చిన నామినేషన్ సర్వీసు రిజిష్టరునందు అంటించి నమోదు చేయించి అధికారిచే సంతకం చేయించవలెను. ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు, భోధనేతర సిబ్బందికి జి.ఓ.యం.ఎస్.నెం.315 విద్యాశాఖ తేది 22-7-86 ద్వారా యిటువంటి స్కీము 1-7-86 నుండి వర్తింపచేయబడింది. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు యల్.ఐ.సి వారే నేరుగా ప్రీమియంలు వసూలు చేసి, తదుపరి వారే డబ్బు చెల్లిస్తారు. కాని ఎయిడెడ్ కాని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు యల్.ఐ.సి తో ఏ మాత్రం సంబంధం లేదు.                                                                                                                                                 ఇన్సూరెన్సు మరియు సేవింగ్స్ మొత్తం చెల్లింపు విదానం ------ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతని సభ్యత్వ గ్రూపును బట్టి ఎంత చెల్లించుచున్నారో, అన్ని వేల రూపాయలు చొప్పున ఇన్సూరెన్సు మొత్తంతో పాటు ఆనాటికి సేవింగ్స్ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు. కాని ఉద్యోగి రిటైర్ అయినా లేక రాజినామా చేసినా సేవింగ్స్ మొత్తమును మాత్రమే ప్రతి సంవత్సరము ప్రభుత్వంచే విడుదల చేయబడిన పట్టిక ప్రకారం చెల్లిస్తారు.                                                                                                                                         లెక్కించు విదానము (ఒక యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు) ------      1) పధకములో చేరి 31-10-94 నటికి పూర్తయిన సంవత్సరములను బట్టి ఆనాటికి సేవింగ్స్ ఖాతాలో వడ్డితో సహాగల నిల్వ మొత్తము (ACM = Accumulated Savings)ను  Table - I నుండి గుర్తించాలి.         2) సభ్యత్వము ముగియునాటికి సదరు నిల్వ మొత్తముపై లభించెడి వడ్డీని Table - II లో గుర్తించాలి.        3) 1-11-94 నుండి నుండి సభ్యత్వము ముగియునాటికి లభించు వడ్డీతో కూడిన సేవింగ్స్ మొత్తమును Table - III లో గుర్తించాలి.                                                                                                                                                  ఈ మూడింటిని కలుపగా వచ్చు మొత్తం ఒక యూనిట్‌కు చెల్లించబడే అంతిమ మొత్తం అవుతుంది. దానిని యూనిట్ల సంఖ్యచే గుణిస్తే సభ్యునికి అంతిమంగా చెల్లించబడే అంతిమ మొత్తం తెలుస్తుంది.