HEALTH CARDS

ఆరోగ్యకార్డు కోసం దరఖాస్తు విధానం

ఉద్యోగి లాగిన్ కావడానికి ముందే, కింది డాక్యుమెంట్లను, ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలి.
1) వ్యక్తిగతమైనవి (స్కాన్ చేసి ఉంచుకోవలసినవి - ప్రతిది 200 కెబీ లోపు సైజుండాలి)
  • ఆదార్ కార్డు (లేదా) ఆదార్ నమోదు రసీదు.
  • ఉద్యోగి పేరు, జనన తేది, సంతకము, కార్యాలయ ఉన్నతోద్యోగి వివరాల కోసం పాత సర్వీసు రిజిస్టరు అయితే 4,5 పేజీలు, కొత్త సర్వీసు రిజిస్టరు అయితే 1,2 పేజీలు.
  • జననతేదీ సర్టిఫికెట్ (తప్పనిసరి కాదు)
  • ఐసీఏఓ తరహాలో పొందిన పాస్‌పోర్టు సైజు ఫొటో డిజిటల్ కాపి (45 మి.మీ X 35 మి.మీ)
  • వికలాంగులైనట్లయితే అంగవైకల్య ధృవీకరణ పత్రం. 

2) ఆధారపడిన వారివి (స్కాన్ చేసి ఉంచుకోవలసినవి - ప్రతిది 200 కెబీ లోపు సైజుండాలి)

  • ఆధార్ కార్డు (లేదా) ఆధార్ నమోదు రసీదు.
  • ఐసిఏఓ తరహాలో పొందిన పాస్‌పోర్టు సైజు ఫొటో డిజిటల్ కాపి (45 మి.మీ X 35 మి.మీ)
  • ఐదేళ్ల లోపు చిన్నారులైనట్లయితే జనన ధృవీకరణ పత్రం
  • వికలాంగులైనట్లయితే అంగవైకల్య ధృవీకరణ పత్రం
  • జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి (లేదా) పింఛనుదారు అయివుంటే, వారి సర్వీసు రిజిస్టరు (లేదా) పింఛను చెల్లింపు ఆర్డర్ స్కాన్ చేసిన కాపీలు.

ఇప్పుడు వెబ్‌సైట్‌కు లాగిన్ అవండి.

  • తెరపై కుడివైపు ఎగువ భాగంలో వున్న" సైన్ ఇన్" పై క్లిక్ చేయండి.
  • మీ యూజర్ ఐడి : మీ ఉద్యోగ ఐడి ( మీ డి.డి.ఓ వద్ద లభించేది )
  • పాస్‌వర్డ్ కూడా : మీ ఉద్యోగ ఐడినే ( మీ యూజర్ ఐడీనే )
  • ఇలా లాగిన్ అవండి : ఉద్యోగి (లేదా) పింఛనుదారు అనే డ్రాప్‌డౌన్ జాబితా నుంచి " ఉద్యోగి " అని ఎంపిక చేసుకొనండి.
  • లాగిన్ అయిన తర్వాత మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. ( మీ కొత్త పాస్‌వర్డ్ తప్పనిసరిగా కనీసం 3 నుంచి 8 క్యారెక్టర్లలోపు వుండాలి. వాటిలో ఒక అక్షరం, ఒక అంకె, ఒక ప్రత్యేక సంకేతం ( / l = వంటివి) తప్పనిసరిగా ఉండాలి.
  • మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • మీ ఈ - మెయిల్ ఐడిని నమోదు చేయండి.
  • కొత్త పాస్‌వర్డ్ మీ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ (లేదా) ఈ - మెయిల్ ద్వారా అందుతుంది.
  • సైన్ ఇన్ చేశాక : ఎడమ వైపు ఉన్న " రిజిస్ట్రేషన్స్‌ " పై క్లిక్ చేయండి.
  • తర్వాత " ఇనీషియేట్ హెల్త్‌కార్డ్ " పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు : ఆధార్ సంఖ్య (లేదా) ఆధార్ నమోదు సంఖ్యపై క్లిక్ చేయండి.

   ఆధార్ సంఖ్య (లేదా) ఆధార్ నమోదు సంఖ్యను కింద పేర్కొన్న విధంగా నమోదు చేయండి.

ఎ) మీకు ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆధార్ నంబర్ బాక్సులో 12 అంకెల సంఖ్యను నమోదు చేయండి.

బి) మీ వద్ద ఆధార్ నమోదు రసీదు మాత్రమే ఉన్నట్లయితే, రసీదు ఎడమ వైపున ఉన్న 14 అంకెల సంఖ్యను ఈహెచ్‌ఎస్ ఈ - ఫారంలో గుర్తింపు వివరాల వద్ద నింపండి. ఉదా . మీ నమోదు సంఖ్య 1111/15210/02106 అనుకోండి. ఈ 14 అంకెల సంఖ్యను  ఈహెచ్‌ఎస్ ఈ - ఫారంలో ని గుర్తింపు వివరాలు కింద 11111521002106 గా నింపండి.

సి) రసీదులో కుడివైపు  టైమ్‌స్టాంపుతో ఉన్న తేదీని గమనించండి. తేది (2 అంకెలు) , నెల (2 అంకెలు) , సంవత్సరం (4 అంకెలు), గంటలు (2 అంకెలు), నిమిషాలు (2 అంకెలు), సెకన్లు (2 అంకెలు), మొత్తం 14 అంకెలు.

డి) దీనిని పూర్తి వరుస సంఖ్యగా మార్చండి. తేదీని కుడి నుంచి ఎడమకు ఎలాంటి స్లాష్‌లు లేకుండా, అలాగే టైమ్‌ను కోలన్స్ లేకుండా రాయండి. ఉదా. తేది. 11/08/2011 16:48:44 అయితే, దానిని 20110811164844 గా నమోదు చేయాలి.

ఇ) ఈ సంఖ్యను 14 అంకెల నమోదు సంఖ్యకు కొనసాగింపుగా నమోదు చేయండి. ఈ 28 అంకెల నమోదు ఐడి 14 అంకెల నమోదు సంఖ్య, తేదీ, టైమ్‌స్టాంపుతో రూపొందించబడింది. ఉదా. 1111152100210620110811164844

ఎఫ్) ఈ 28 అంకెల సంఖ్యను ఆధార్ నమోదు సంఖ్య బాక్సులో నమోదు చేయండి.

  • ఇప్పుడు " రిట్రీవ్ డిటెయిల్స్ " పై క్లిక్ చేయండి.
  • మీకు దరఖాస్తు ఫారం కనిపిస్తుంది.
  • ఇక్కడ అవసరమైన వివరాలను నింపండి.
  • వివరాలు నింపిన తర్వాత " సేవ్ " బటన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం " యాడ్ అటాచ్‌మెంట్స్ " పై క్లిక్ చేయాలి.
  1. అటాచ్‌మెంట్స్‌ను అప్‌లోడు చేసే ముందు అవి 200 కేబీ లోపు సైజుండేలా చూసుకోవాలి. స్కానింగ్ చేసేటప్పుడే మీరు రిజల్యూషన్‌ను తగ్గించుకోవచ్చు.
  2. ఎం.ఎస్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ లేదా ఎం.ఎస్ - పెయింట్‌లలోని ఎడిట్ ఆప్షన్ ద్వారా పిక్చర్‌ను 200 కేబీ లోపు సైజుకు అనుగుణంగా కుదించవచ్చు.
  3. అటాచ్‌మెంట్లను తేలికగా గుర్తించేందుకు వీలుగా వాటికి స్పేస్ లేదా స్పెషల్ కేరెక్టర్లు లేకుండా పేరుపెట్టాలి.
  • ఇప్పుడు " యాడ్ బెనిఫిషియరీ " పై క్లిక్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులను యాడ్ చేయండి.
  • కుటుంబ సభ్యుల ఫొటో, ఆధార్‌కార్డు అప్‌లోడ్ చేయండి.
  • నమోదు చేసిన వివరాలన్నీ సరిగ్గానే వున్నాయని తనిఖీ చేసుకోండి.
  • ఒకవేళ అటాచ్‌మెంట్లలో తప్పులున్నాయని భావిస్తే, చెక్‌బాక్సును ఎంపిక చేసుకుని " రిమూవ్ అటాచ్‌మెంట్ " ఆప్షన్‌ను క్లిక్‌చేసి, వాటిని తొలగించవచ్చు. తిరిగి బ్రౌజ్ చేసి సరైన అటాచ్‌మెంట్‌ను సరైన చోటులో జతచేయవచ్చు.

గమనిక:-

  1. ఒకవేళ జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వోద్యోగి (లేదా) పింఛనుదారు అయినట్లయితే ఆ వివరాలను దరఖాస్తులో కేటాయించిన ప్రదేశంలో నమోదు చేయాలి.
  2. ఆన్‌లైన్ ద్వారా మీరు సమర్పించిన దరఖాస్తులోని మీ కుటుంబసభ్యుల వివరాలన్నిటికీ మీదే బాధ్యత. ఇందులో ఏదైనా సమాచారం తప్పు అని రుజువైతే క్రమశిక్షణ చర్యలకు గురవుతారని గుర్తించండి.
  • నమోదు ఫారాన్ని సేవ్ చేయండి.
  • సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి, దరఖాస్తును సమర్పించండి.
  • ఒక్కసారి సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేసిన తర్వాత సమాచారంలో ఇక ఎలాంటి మార్పుచేర్పులు చేసేందుకూ వీలుండదు.
  • మీ దరఖాస్తు సమర్పించగానే మీ మొబైల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది.
  • ఇప్పుడు దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీయండి.
  • ప్రింట్ తీసిన దరఖాస్తుపై సంతకం చేసి, దానిని స్కాన్ చేయాలి.
  • లాగిన్ సెషన్ ఎక్సపైర్ అయ్యే అవకాశాలు ఉన్నందున మీరు మరోసారి లాగిన్ కావాల్సి రావచ్చు.
  • యాడ్ అటాచ్‌మెంట్ క్లిక్ చేయడం ద్వారా సంతకం చేసిన దరఖాస్తును ఇప్పుడు అప్‌లోడ్ చేయాలి.
  • ఇప్పుడు మీ మొబైల్‌పోన్‌కు మరో విధంగా మరో సందేశం అందుతుంది.

దరఖాస్తు విజయవంతంగా దాఖలు చేయడం జరిగింది. నమోదు ఐడి ...ఇఎమ్‌పి ... డిడిఓ ... కోడ్ వద్ద పెండింగ్‌లో వున్నది.

  • ఒకవేళ డిడిఓ మీ దరఖాస్తును తిరస్కరించినట్లయితే, మీ మొబైల్‌పోన్‌కు సందేశం వస్తుంది.
  • అప్పుడు మిరు మరోసారి లాగిన్ కావల్సి ఉంటుంది. చిన్న చిన్న మార్పులైతే ఎడిట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద మార్పులైతే రీసెట్ చేసి, మొత్తం వివరాలను తిరిగి నింపాల్సి ఉంటుంది.
  • లబ్దిదారు వివరాలు లేదా అటాచ్‌మెంట్లను సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతే అందులో మార్పుచేర్పులు చేసుకునేందుకు వీలవుతుంది.
  • సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి
  • దరఖాస్తును ప్రింట్ తీసుకుని, దానిపై సంతకం చేసి, స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
  • సబ్మిట్ అప్రూవల్ పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు డి.డి.ఓ లాగిన్‌కు చేరుతుంది.
  • మీరు సంతకము చేసిన దరఖాస్తు అసలు ప్రతి డిడిఓకి మీరు నేరుగా అందించాల్సిరావచ్చు.
  • మీ దరఖాస్తును డిడిఓ ఆమోదించినట్లయితే, మీకు ఆరోగ్యకార్డు నమోదు దరఖాస్తు డిడిఓ కోడ్ ఆమోదించడం జరిగింది అనే సందేశం వస్తుంది.
  • మీ ఆరోగ్యకార్డు సిద్ధమైన వెంటనే, మీ మొబైల్ పోన్ కు (లేదా) ఈ - మెయిల్‌కు సమాచారం అందుతుంది.

(తాత్కాలిక లేదా శాశ్వత ఆరోగ్యకార్డు వివరాలు కోసం ఉద్యోగుల లాగిన్ సూచనలను చూడండి.) 

GO.174.pdf (76195)
GO.175.pdf (69792)
GO.176.pdf (589517)
MeeSevaApplication_EMPLOYEES.pdf (33965)
Modified Employee Steps_to_enrol_Tel.pdf (70747)

 

OLD G.O'S

1) Recognised private hospitals list as on 17/10/2011 :- CLICK HERE

2) G.O.Ms.No.68, H,M & F W (K1) Dept. Dated 28 - 3 - 2011    మరియు      Proceedings No:3858 / M.B.- 4 / 2011-2 Dated 6-6-2011    ప్రకారము     వైద్య     ఖర్చులు     నిమిత్తం     ప్రతిపాదనలు     రూ.50,000 / -      వరకు     జిల్లా     విద్యా     శాఖాధికారి     స్ధాయిలో పరిష్కరించవలెను.    For G.O. copy : CLICK HERE