01. సీనియర్ ఉపాధ్యాయులు తనకంటే జూనియర్ ఉపాధ్యాయుల కంటే తక్కువ వేతనము పొందుతుంటే అట్టి వ్యత్యాసమును FR-27 ప్రకారం సవరించుటను స్టెప్అప్ అంటారు.
02. అప్రయత్న పదోన్నతి పథకం (AAS) అమలు వల్ల వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం G.O.Ms.No.297, F & IP, తేది. 25-10-1983 ద్వారా స్టెప్అప్ ఉత్తర్వులు జారీ చేసింది.
03. AAS అమలు వల్ల వచ్చిన వ్యత్యాసమును సవరించుటకు ప్రభుత్వం G.O.Ms.No.75, F&IP, తేది.22-2-1994 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
04. ఇట్టి సౌకర్యాన్నిఉపాధ్యయులకు కూడా వర్తింపజేస్తూ G.O.Ms.No.475 Edn. తేది.2-11-1998 విడుదల చేసింది.
05. పై ఉత్తర్వులు 1993 పిఆర్సి అనగా 31-7-1993 వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తదుపరి ఆర్పియస్ 2005లో పునరుద్దరింపబడింది.